11, ఏప్రిల్ 2009, శనివారం

ఉయ్యాల చిలకలు

ఉయ్యాల చిలకలు


మా పల్లె,వ్రేపల్లె లోన,"ఆ-ఊ-అం"అంటూనూ
ఉంగా ఉంగాలు,తీపి - బుంగా కేరింతల్లు
మధుర దాక,చేరేను,ఈ ముద్దుల నవ్వుల్లు//

చిన్నారి శ్రీ కృష్ణుని-కేరింతలు చెవి సోకెను
రెల్లు పూలు పూసినవి-బృందావని పక పక మనె 
వెదురు వనమంతా,నిలువెల్లా వేణు నాదమాయెను//

ఊయలపై చిలకలను,కట్టిందీ యశోదమ్మ 
కన్నయ్య పెదవులపై చిలక పలుకు లొలికెనేను
శ్రీ సరస్వతి వీణియపై మధు నాదము చిలికేను//

ఆ ముద్దూ మురిపాలూ, ముచ్చటలను కను గొనీ
సీత కోక,రా చిల్కలు,అందాలూ గుమి గూడెను
నాదాలూ చేరినవి,వేణు నాదాలై గుమి కూడెను
రాగాలూ చేరెను, అను రాగాలై గుమి కూడెను
యమున అలల వెన్నెలలు,రంగ వల్లులే ఆయెను//

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...