4, జనవరి 2010, సోమవారం

శుభాశీస్సులు


మలై కళ్ళన్, అగ్గిరాముడు అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్న చలనచిత్రాలు. ఈ రెండింటిలోనూ కథానాయిక పద్మశ్రీ భానుమతీ రామక్రిష్ణ. ఎం.జి.రామచంద్రన్ ఇంకా తమిళ సినిమా రంగములో నిలదొక్కుకోలేదు."రామచంద్రన్!" అని పిలిచేది.

కొంత హస్త సాముద్రికము నేర్చుకున్న భానుమతి సెట్టింగ్సు వద్ద తీరుబడిగా ఉన్నప్పుడు M.G.R. చేతులోని రేఖలను చూసి, చెప్పింది "రామచంద్రన్! మీకు భవిష్యత్తులో రాజపరిపాలనాయోగము ఉన్నది."దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని అతను నవ్వేసారు. Puliakulam వద్ద షూటింగు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన సంభవించినది. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఎం.జి.రామచంద్రన్ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఆ చీఫ్ మినిష్టరుకు అభినందనలు చెప్పడానికి భానుమతీ రామక్రిష్ణ వెళ్ళారు. ఆమెను చూస్తూనే అన్నారు ఎం.జి.రామచంద్రన్ ఇలాగ,"అమ్మా! ఆ రోజు మీరు చెప్పిన జ్యోతిష్యం నిజమైనది. మీ వాక్కు ఫలించినది." నిజానికి ఆమెకు కూడా తాను చెప్పిన హస్త సాముద్రికము సరిగా గుర్తు ఉన్నదో లేదో గానీ, రామచంద్రన్ మాత్రం ఆమె "నోటి చలువ"ను బాగా జ్ఞాపకం ఉంచుకున్నారు.

Views (26)

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...