20, మార్చి 2010, శనివారం

తోమని పళ్ళాల వాడు















వేడు కుందామా
వేంకట గిరి వేంకటేశ్వరుని ||

ఆపద మ్రొక్కుల వాడే
ఆది దేవుడే వాడు
తోమని పళ్యాల వాడే
దురిత దూరుడే ||

వడ్డి కాసుల వాడే
వనజ నాభుడే
పుట్టు – గొడ్రాండ్రకు
బిడ్డలిచ్చే గోవిందుడే ||

ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు,అలమేల్మంగా వేంకటాద్రి నాథుడే ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

This is a melodious ' sankirtana '
Written by " annamacharya " )

ఈ అన్నమాచార్యుల కీర్తనలో “ తోమని పళ్ళాల వాడు ”
( తోమని పళ్యాల వాడే )అని సంబోధనను పరిశీలన చేస్తారా?

ఆచ్చ తెనుగు మాటలతో తిరుమల గిరి శ్రీనివాసునికి
కొంగ్రొత్త పేర్లను పెట్టి, వివిధ నామ ధేయాలతో
స్వామిని నోరారా పిలిచే చనువును సంపాదించుకున్నట్టి
భక్తాగ్రేసర కవి మన అన్నమయ్య అని ఘంటా పథంగా చెప్పుకో వచ్చును.

ఫ్రాచీన కాలంలో 'మట్టి పాత్రలను'
వంట చేయడానికి ప్రజలు వాడే వారు.

కురవత్తి నంబి శ్రీ తిరుమలేశుని అనురాగముతో సేవలు చేసే వాడు.
వాత్సల్య భక్తితో సేవించే కురవతి నంబి వృత్తి రీత్యా “ కుమ్మరి వాడు”.
కుంభ కారుడైవ నంబి ఆహార, భక్ష్యాదులను
కుండలలో వండి ఆ పదార్ధాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించు కునే వాడు.

ఇదే ఆనవాయితీ
ఆ తర్వాత చాలా సంవత్సరముల పాటు కొన సాగింది.
దేవళములోని సిబ్బంది
“ మట్టి పాత్రలలో వంట చేసి తయారు చేసిన భోజన,ప్రసాదాదులను”
భక్తులకు ఇచ్చే వారు.

ఆ నైవేద్య ప్రసాదములను,
వారు ఒక పగిలిన కుండ పెంకులలో పెట్టి ఇచ్చేవారు.
నేటికీ వేంకట రమణునికి
ఇదే పద్ధతిలో తిను బండారములను అర్పిస్తూనే ఉన్నారు.

“ పాల మీగడలు , గడ్డ పెరుగులు " కల బోసి , తీయని భక్ష్యమును చేస్తారు.
ఈ మధుర పదార్ధమునకు “ మాత్ర “ అని పేరు.

ఫ్రతి రోజు “ కుల శేఖర పడి “ లో నుండి వెళ్ళి , గర్భ గుడిలో ఈ మాత్ర
పదార్ధమును నైవేద్యముగా సమర్పిస్తూన్నారు.
అలాగ మట్టి పాత్రలోనే శ్రీ నాథునికి
“ మాత్ర మధు ఆహారమును”
ఒసగుతున్నారు.
ఆ తర్వాత ఆ మృణ్మయ పాత్రలను పగల గొట్టేస్తారు.

పిమ్మట , మళ్ళీ ప్రసాదానికి
తప్పనిసరిగా కొత్త మృణ్మయ పాత్రనే వాడ వలసి వస్తుంది కదా!

అదే లోహ పళ్ళెరములు అయితే - మళ్ళీ తోమి,శుభ్ర పరచి, వాడే వారు.
మిత్తి కుండలు అవడము వలన - పగల గొట్టేస్తారు ,
కావున, శుభ్రం చేసే అవసరం లేదు కదా!
కాబట్టే, సంకీర్తనాచార్యుడు “ తోమని పళ్యాల వాడు ... '
అంటూ ముచ్చటగా పిలుస్తూ, ముచ్చటించాడు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Telusaa!

తోమని పళ్ళాల వాడు

By kadambari piduri, Mar 12 2010 8:47PM

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మొన్న ఒక రోజు ఈ పాట వింటూ, సరిగ్గా ఈ 'తోమని పళ్ళాలా గురించే బుర్ర బద్దలు కొట్టుకున్నాను. చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.

kvrn చెప్పారు...

తోమని పళ్ళాల వాడు. చాల చక్కగా వివరించారు.
పూరి జగన్నాధునికి అన్ని ప్రసాదాలను మట్టి పాత్రలలో వండుతారని విన్నాను

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...