3, జూన్ 2010, గురువారం

హవా హవాయి ,పళ్ళు టోపీలు























కారమెన్ మిరండా పాటలు
తెలుగు, తమిళ సినీ మ్యూజిక్కును ప్రభావితం చేసాయి.
ఆమెకు `Brazilian Bombshell' “Queen of Samba.' , ఇత్యాది బిరుదములు ఉన్నాయి.

వైట్ హౌస్ లో ఫ్రాంక్లిన్ రూస్ వెల్ట్ (President Franklin D. Roosevelt) సమక్షంలో
ప్రదర్శనను ఇచ్చింది;
అమెరికా దేశము పౌరులు కాకుండా,
ఆ అగ్ర రాజ్యమునకు చెందని విదేశీ వనిత
అలాంటి గౌరవాన్ని దక్కించుకున్న మొట్ట మొదటి వనిత ఆమె!

ఆమె అసలు పేరు Maria de Carmo Miranda da Cunha.
పోర్చుగీసు పట్టణంలో ఫిబ్రవరి 9, 1909 లో జన్మించినది.
ఆమె తండ్రిది మంగలి వృత్తి .
ఆరుగురు సంతానములో ఆమె ఒకర్తె.
బ్రతుకు తెరువుకై,
ఆ కుటుంబం బ్రెజిల్ రాజధాని ‘ రియో డి జనిరో’కి తరలి వెళ్ళారు.
ఆమె చదువుకు స్వస్తి చెప్పి, పనిలో చేరింది.
స్త్రీల కోసం “ రియో డిసైనింగ్ హాట్స్ షాపులో ఉద్యోగిని.
అక్కడ– రద్దీలో, వేచి ఉన్న కస్టమర్లకు బోరు కొట్టకుండా ఉండేటందుకై
పాటలు పాడుతూ వినోదాలు పంచేది.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Shop కు వచ్చే కొనుగోలుదారులు ఒక పార్టీలో ఆమెకు పాట పాడటానికి
ఇచ్చిన అవకాశమే ఆమె జీవితమును మేలైన మలుపును త్రిప్పింది.

అత్యంత వేగంగా అంచెలు అంచెలుగా
గానము,డ్యాన్సులు,,స్టేజీ కార్యక్రమాలు,
రేడియో పోగ్రాములు , ఆమెను వెదుక్కుని రాసాగాయి.

ప్రత్యేకించి, ఆహార్యము, అలంకరణలు “ కేరమిన్” వొగా ప్రసిద్ధి కెక్కాయి.
డ్రస్సులు, ఆభరణములు, ఆమె ప్రతి కదలిక – కళా రంగము నుండి
సమాజములోనికి వ్యాపించాయి.

ముఖ్యంగా, ఆమె డిసైన్ చేసుకున్న “ టోపీ”
విపరీతంగా ఆకర్షించింది.
తలపాగా, కుచ్చు టోపీ, సర్కస్ బఫూనరీ టోపీ ల మాదిరిగా
అలరించినది –[ వి.]
టుట్టీ – ఫ్రూట్టీ హ్యాట్సు” అనే పేరు వాటికి వచ్చింది.
turban-hats ద్రాక్ష గుత్తులు, బత్తాయిలు, ఆపిల్సు, పైన్ ఆపిల్సు,వంటి పళ్ళతో -
కలర్ ఫుల్ గా అమరించేది.
ముదురు పసుపు రంగు (bright yellow bananas ) అరటి పళ్ళు
వాటికి అదనంగా చేకూరిన సొగసులు,
ఫ్యాషన్ ప్రపంచములో, టోపీలకు ప్రత్యేక స్థానాన్ని సముపార్జించి పెట్టాయి.

ఈ కదళీ ఫలాల కథాకళీ ఘనతను ఏమని వర్ణించ గలము!!!!?
1955 లో “`Carmen Miranda, Bananas Is My Business.' అనీ,
ఏకంగా డాక్యుమెంటరీ చిత్రమే నిర్మించ బడింది.
న్యూయార్కు, బ్రాడ్ వే లో ఆమె పేరు మార్మ్రోగింది.

1940 లో, తన తొలి సినిమా `Down Argentine Way' ( debut ) తో,
కీర్తి బావుటా ఎగుర వేసింది.

`Mamãe eu Quero... ,'
వగైరా పాటలూ, చిత్రాలూ సంగీత, నాట్య, నటనా రంగాల చరిత్రలో
ఆమె యశస్సును చిర స్థాయిగా నెలకొల్పాయి.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

అన్నట్లు మీకందరికీ, ఈ సరికే గుర్తుకు వచ్చి ఉండాలి కదా!!!!

అదేనండీ, శ్రీ దేవి “హవా హవాయీ.” గా రంగ ప్రవేశం .......
సారీ! తెర ప్రవేశం చేసింది కదా,

ఆ!......... అదేనండీ .........
అనిల్ కపూర్ హీరో గా వేసిన మూవీ
“ MR. India” .!!!!!!!

ఈ movieలో శ్రీ దేవి ధరించిన టోపీ, దానికి తగిలించుకున్న పళ్ళూ,
ఫలహారంలాగా మెక్కుతూ, వస్తుంది .........
ఓ.కే. !!!!!!!!
మనం ఇప్పుడు “ టూటీ ఫ్రీటీ హాట్ / కాప్ “ అనీ పిలుద్దామా???

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Pramukhula Haasyam


By kadambari piduri, May 14 2010 9:16AM

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...