12, అక్టోబర్ 2010, మంగళవారం

విజయ రాఘవ నాయకుని కొలువులో "శారదా ధ్వజము"

















తంజా వూరు మహా రాజు విజయ రాఘవ నాయకుని కొలువులో ఉన్న
చెంగల్వ కాళ కవి -
తనను వ్రాసిన "రాజ గోపాల విలాసము" నందు -
"శారదా ధ్వజము "ను సీస పద్యాలలో చేసిన వర్ణన ఇది .
మూలా నక్షత్రములో, దుర్గా దేవికి "శ్రీ సరస్వతీ దేవి అలంకారము"ను చేస్తున్నారు.
ఈ సందర్భముగా ఈ పద్యాన్ని పరికిద్దాము.
“ ఒక్కొక్క యెడ చీని చక్కెర పానకం
బానిన ట్లాహ్లాద మావహిల్ల

నొక్కొక్క యెడ తావి నెక్కొన విరజాది
సరము లెత్తిన రీతి పరిమళింప

నొక్కొక్క యెడ చల్వ లుప్పతిల్లంగ మంద
మారుతంబులు మించు మహిమ చెలగ

నొక్కొక్క యెడ మేన చొక్కు సంపాదించు
వెలది వెన్నెల తేట విధము మించ

కవిత రచియింప విజయ రాఘవ విభుండె
నేర్చు నని వాణి నర్తించు నేర్పు మీఱ
చామరానిల కందళ చలిత మగుచు
తనరు సభ యందు నల “ శారదా ధ్వజంబు "

చెంగల్వ కాళయ కవి "రాజ గోపాల విలాసము"ను రచించెను.
అయిదు ఆశ్వాసముల ఈ శృంగార కావ్యంలో
నాల్గు వందల డెబ్భై (470) పద్యాలు ఉన్నాయి.

"చంపకారణ్య మాహాత్మ్యము" అనే స్థల పురాణం నుండి ఈ కథను గ్రహించి,
చెంగల్వ కాళయ కవి విరచించెను.
చంపక వనమునందు తపసు చేసిన –
గోప్రళయ ముని కోరికను తీర్చుటకై
శ్రీ కృష్ణుడు ఆ చంపక వనములో వెలసెను.

సౌరాష్ట్ర దేశాధిపతి కథను జొప్పించిన "హరిద్రా నది మాహత్త్వము " ను
కొన్ని పద్యాలలో వర్ణించినాడు చెంగల్వ కవి.
చంపక వన క్షేత్రమున వెలసిన " రాజ గోపాల స్వామి " భక్తుడు - విజయ రాఘవ నాయకుడు .
"దక్షిణ ద్వారక"గా పేరొందిన ఈ క్షేత్రమును కేంద్రముగా గైకొని,
విజయ రాఘవ నాయకునికి అంకితమిచిచిన కావ్యమే ""రాజ గోపాల విలాసము".

సహ్యజా తీరమును బృందావనమనమునకు సమానము అనే దృష్టితో సాగిన
ఈ పద్య సంపుటిలో నిదే "శారదా ధ్వజము"ను తెలిపిన పై పద్యము.
[చెంగల్వ కాళ కవి వివరములు :::::
వీరు పాక నాటి నియోగి బ్రాహ్మణులు, శ్రీ వత్స గోత్రుడు,
అతని తాత కాళయ మంత్రి; పితా మహి ( నాయనమ్మ) గంగమాంబ ;;;;
చెంగల్వ కాళ కవి యొక్క తల్లి దండ్రుల నామ ధేయాలు కృష్ణమాంబ,వేంకటయ్య .
వేంకటయ్య రచించిన కావ్యము “ పార్వతీ పరిణయము మంత్రి వద్ద ”,
ఈయన “ రణ రంగ గంధ వారణ” అనే బిరుదు కలిగి ఉన్నట్టి
“ శ్రీ కంఠ భూపతి ” వద్ద మంత్రి .]

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...