16, అక్టోబర్ 2010, శనివారం

"అమర కోశము" నిఘంటువు - (“Dictionaries Day” )
















అక్టోబర్ 16 వ తేదీ “Dictionaries Day” గా నిర్వహించబడుతూన్నది.
Espiranto language” ప్రయోగానికి
18 వశతాబ్దం ద్వితీయార్ధంలో ప్రప్రధమంగా శ్రీకారం చుట్టారు.
(Esperanto = widely spoken constructed international auxiliary language)
అన్ని భాషలలోనీ ఉపయుక్త అంశాలతో ఒక “ప్రపంచ భాష - ను నిర్మించే బృహ ప్రయత్నమే" ఇది.
ఐతే ఇది ఇంకా పూర్తిగా సాకారం అవలేదు.
హిందూ దేశంలో ఇలాంటి ప్రయత్నం క్రీస్తు పూర్వమే మొదలైనది.
ఆ ప్రయత్నం సక్సెస్ ఐనది కూడా!
ఆ విజయవంతమైన కార్యక్రమ సౌందర్య రూపమే “ సంస్కృత భాష”.
అలనాటి భాషా విద్వాంసుల కృషియే మన సంస్కృత భాష.
“దేవతల భాష’అనీ, “గీర్వాణ భాష” అనీ వినుతికెక్కినది.
“పాణిని” వంటి మేధావులు రూపొందించిన వ్యాకరణ పట్టిక – “న భూతో న భవిష్యతి"
అమర కోశము'' అనే సంస్కృత భాషా నిఘంటువును
4, 5 శతాబ్దాల నడుమ అమరసింహుడు రచించాడు.
వేలాది పదములను శ్లోకములుగా సౌందర్య భరితం చేసాడు మహా మేధావి అమర సింహుడు.
(1940 సంవత్సరములో కాకినాడ నుండి శ్రీ పతి ముద్రణాలయము ముద్రణ జరిగినది.
తర్వాత వావిళ్ళ వారు, జయ లక్ష్మీ పబ్లికేషన్ మున్నగు వారు
ఎందరో మహానుభావులు ఇట్టి అమూల్యమైన మన ఆర్ష విజ్ఞానాన్ని,
పురాతన సారస్వతాన్ని ఈ నాటి మనకు అందుబాటులో ఉన్నదీ అంటే - అట్టి వారి కృషియే కారణం.)
ఇందులో మూడు కాండలు అనగా (=భాగములు)ఉన్నవి.
అమర కోశములో
ప్రథమ కాండము లో ;;;;;
1."స్వర్గ వర్గము" -(మొత్తము 12) మొదలు "వారి వర్గము" వరకున్నూ ;;;

ద్వితీయ కాండములో ;;;;;
భూ వర్గము మొదలు శూద్ర వర్గము వరకున్నూ(10) ;

తృతీయ కాండము లో;;;;;
విశేష్య నిఘ్న వర్గము , సంకీర్ణ వర్గము ,
నానార్థ వర్గము , నానార్థావ్యయ వర్గము,
అవ్యయ వర్గము, లింగాది సంగ్రహ వర్గము (7) ఉన్నాయి..

శాశ్వతకోశము (నానార్ధములు),
అభిదారత్నమాల (పర్యాయపదములు),
ఏకాక్షర కోశము - ఇత్యాదిగా అనేక సంస్కృత నిఘంటువులు వెలువడినవి.

తెలుగులో ఈ నిఘంటు రచనకు కవి చౌడప్ప(17 వ శతాబ్దము)శ్రీకారం చుట్టాడు.
పైడిపాటి లక్ష్మణ కవి రచన ''ఆంధ్రనామ సంగ్రహము'',
అడిదము సూరకవి యొక్క ''ఆంధ్రనామ శేషము'' మున్నగు
(పద్య రూపంలో ఉన్న)దాదాపు 29 నిఘంటువులు
ఆంధ్ర మాతృ భాషా సేవకులకు లబ్ధములు ఐనాయి.

నేడు అ పరిమితమైన టెక్నికల్ , విజ్ఞానమువలన
సంఘములో పరిశ్రమలు, పత్రిక్తీసినిమాలూ ,రాజకీయములు,
పెను మార్పులతో ఆవిష్కరించబడిన ప్రపంచ సామాజిక చిత్రపటము మన ఎదుట ఉన్నది.
ఇందులో తప్పని సరిగా ప్రతి వ్యక్తీ భాగస్వామి అవవలసి వస్తూన్నది.
తత్ఫలితంగా, భాషకు అనేక కొంగ్రొత్త పదములు వాడుకలో అవసరం ఔతూన్నాయి.
అందువలననే డిక్షనరీలు అగణిత శాఖా కోణాలలో నిర్మితము ఔతూన్నాయి.
జర్నలిస్టులు, పత్స్టువార్తలు, ఇంజనీరు, లా, వైద్యము,ఖనిజములు ఇత్యాది శాఖలుగా
విసృతముగా డిక్షనరీలు మార్కెట్టులో ఉన్నాయి.
సాహిత్య చరణ మంజీరాలు అగణితముగ సంవృద్ధి చెంది , హృదయోల్లాసాన్ని కలిగిస్తూన్నాయి.
ఈ నాటి Dictionaies Day సందర్భముగా
మన "అమర కోశము" కర్త ఐన అమర సింహునికి జేజేలు పలుకుదాము.

"అమర సింహునికి జేజేలు.
"అమర కోశము" నిఘంటువు
పద రత్నాకరమ్ము;
ఆ శ్లోకమయ ఉద్గ్రంధము
మన జాతికే గర్వ కారణము."

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...