25, జనవరి 2011, మంగళవారం

నీ పర్మిషన్ అక్కర లేదు!

"భారత మాత కి జై!"
"వందే మాతరం!" స్వాతంత్ర్య సముపార్జనకై
ఆసేతు హిమాచల పర్యంతమూ
ఏక తాటిపై నడిచిన రోజులలో
ఈ నినాదాలు మన భారత దేశంలో ప్రతి అంగుళమూ మార్మ్రోగినాయి.























లార్డ్ కర్జన్ (British India కు ) గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో
అశుతోష్ ముఖర్జీ (శ్యాంప్రసాద్ ముఖర్జీ తండ్రి) కలకత్తా హైకోర్టు జడ్జిగా ఉన్నారు.
ఒకరోజు అశుతుష్ ముఖర్జీని కర్జన్ తన వద్దకు పిలిపించాడు.
‘‘ముఖర్జీ గారూ! మీకు మంచి అవకాశం ఇస్తున్నాం.
మిమ్మల్ని గవర్నమెంట్ పనిమీద ఇంగ్లండ్ పంపిస్తున్నాం!’’
ఈ మాట విన గానే అశుతోష్ సంతోషంతో ఎగిరి గంతేస్తాడనుకున్నాడు కర్జన్.
కానీ అశుతోష్ ముఖంలో ఎటువంటి స్పందనా కనబడలేదు.
‘‘సర్! మా అమ్మగారి
అనుమతి తీసుకుని
ఏ సంగతీ మీకు తరువాత తెలియజేస్తాను!’’
అన్నాడు అశుతోష్ ప్రశాంత వదనంతో
కర్జన్ ఆశ్చర్యపోయాడు.
‘‘నేను ఇండియా గవర్నర్ జనరల్‌ని!
నేను ఆర్డరిచ్చిన తరువాత నీకు ఇంకొకరి పర్మిషన్
అవసరమా?’’
గవర్నర్ జనరల్ కాదు గదా, అతణ్ణి పుట్టించిన సృష్టికర్త ఆర్డరు వేసినప్పటికీ,
అశుతోష్‌కి తన మాతృదేవత దీవనే ముఖ్యం!
ఈ సంగతినే అశుతోష్ ముఖర్జీ గవర్నర్ జనరల్‌కి వివరించి,
గుడ్‌బై చెప్పి బయటకు వచ్చాడు.
కర్జన్ నోట మాట రాలేదు!

















హిందూ దేశంలో కుటుంబ, అనుబంధాలకు
ప్రత్యేక పవిత్ర భావన ఉన్నది.
అలాగే ప్రకృతిలోని ప్రతి అంశాన్నీ దైవత్వానికి ప్రతిరూపంగా
(ఈ నాటికీ )కొలవడం జరుగుతూన్నది.
మనము పుట్టిన ఈ గడ్డ, మట్టి - అని అందరికీ తెలుసు.
కానీ, ఈ భూమిని " మాతృ భావన"తో పూజ చేయడం
బహుశా ప్రపంచంలో
ఇక్కడ మాత్రమే సాధ్యమైనది.
అందుకే
" వందే మాతరం మనదే భారతం!" అని
ఆ నాడు దశ దిశలూ పిక్కటిల్లాయి.
ఈ పై సంఘటనలో
" మాతృ మూర్తికి అశుతోష్ వంటి పౌరులు ఎనలేని గౌరవం ఇవ్వడం,
మాతృ భూమితో ఉన్న మానసిక మమతానురాగాలు
పరస్పరం - బింబ ప్రతిబింబ భావాలై సాక్షాత్కరిస్తునాయి గదూ!
జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో జే జేలు. ;

స్వరాజ్యము కోసమై యావద్దేశము అణువణువూ
ఉత్తేజంతో ఉర్రూతలూగుతూన ఆ రోజులలో -
అశుతోష్ ముఖర్జీ జీవితంలో జరిగిన
ఒక హాస్య సంఘటనకు పునర్దర్శన లాభం .

(see link - konamanini - బుధవారం 28 జూలై 2010 )
నిర్భయత్వానికి మారుపేరు ఈ "Bengal Tiger".
ఇంగ్లీష్ వారు పాలిస్తూన్న ఆ రోజులలో, భారతీయులను ఆంగ్లేయులు
హీనభావంతో చులకన చేసేవారు.
ఒకసారి trainలో అశుతోష్ ప్రయాణం చేస్తున్నాడు.
అతను తన చెప్పుల జతను బెర్త్ కిందపెట్టి, నిద్ర పోసాగాడు.
కొంతసేపటికి ఒక European అదే బోగీలోనికి ఎక్కాడు.
ఆ యూరోపియన్ మనిషికి - సీటు మీద ఒక ఇండియన్ నిద్ర పోవడం -
చాలా ఆగ్రహం కలిగించింది.
ఆ తెల్ల వాడు ముఖర్జీ పాదరక్షల జతను కిటికీలో నుంచి బైటికి విసిరివేసాడు.
పిమ్మట అతడు తన కోటును విప్పి, berth మీద పెట్టి, కునుకు తీయసాగాడు.
Asutosh Mukharji కి మెలకువ వచ్చింది.
తన చెప్పులు కనబడలేదు.
"ఎదుటి సీటు మీద ఉన్న ఇంగ్లీషు వాడు చేసిన పని"అని గ్రహించాడు.

వెంటనే అశుతోష్ అక్కడ కనబడుతున్న తెల్లదొర కోటును
కిటికీలో నుండి విసిరేసాడు.
నిద్ర లేచిన తెల్ల వాడు తన coatను వెతుక్కుంటూ,
"Here! where is my coat?"అంటూ అడిగాడు.
"నీ కోటు నా స్లిప్పర్లను వెదకడానికి వెళ్ళింది."
అని బదులిచ్చాడు అశుతోష్ ముఖర్జీ.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

happy republic day.

kadambari చెప్పారు...

Thank you sir!
We all enjoy The republic day.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...