16, ఏప్రిల్ 2011, శనివారం

పోర్చుగీసు వ్యక్తి వేసిన శ్రీ క్రిష్ణ దేవ రాయలు బొమ్మ























;;;;;

డొమింగో పైస్ పోర్చుగీసు యాత్రీకుడు. 16 వ శతాబ్దంలో విజయ నగర సామ్రాజ్యవైభోగాన్ని స్వయంగా వీక్షించిన భాగ్య శాలి ఈ పోర్చుగీసు దేశీయుడు.డొమింగో పైస్  1520 లో ఆంధ్ర భోజుడు శ్రీ  క్రిష్ణ దేవ రాయలు కాలంలోని రాజకీయ, సామాజిక చిత్రణలు చేసాడు. ముఖ్యంగా నాటి సమాజంలోని పద్ధతులు, ఆర్ధిక ఉన్నత స్థాయి, అతనికి అర్ధమైనంత వరకూ విపులీకరించాడు.DomingO pais  యాత్రా రచనలు మనకు గొప్పఆధారాలుగా నిలిచినవి.(అప్పటి/ నేటి? కూడానేమో............. స్థానిక రచయితలకు ఇలాంటి - చారిత్రక, యాత్రా, వాస్తవ దృక్పథాలతో ఉండే శైలి అలవడక పోవడము, మన కవితా ప్రపపంచంలో చిన్న లోపము- అని ఒప్పుకోవలసి వస్తున్నది, ప్చ్!)DomingO pais  ద్వారా మన చరిత్రకు - ఒక అద్భుత వారసత్వ వరం లభీంచినది కూడా!అదే సాక్షాత్తూ ఆ భువన విజయ అధిపతి చిత్ర పటము.DomingO pais  బొమ్మలు కూడా వేయడంలో చేయి తిరిగిన వ్యక్తి.అతడు స్వయంగా painter  కూడా అవడంతో ఇది సుసాధ్యమై, మనకు అయాచిత వరంగా మన దోసిట్లో  వాలినది.  ఆధునిక కాలంలోSri Krishna Deva Rayalu గురించి అనేక సినిమాలను నిర్మించినారు. ఎక్కువగా దాక్షిణాత్య  నాటకాలూ, చలన చిత్రాలు అవి. south India cinimaలలో అధికంగా కన్నడ, తెలుగు, తమిళ మూవీలు 1965 ల నుండి విడుదల ఐనాయి. ఆ సినిమాలలో, ఆంధ్ర భోజుని ఆహార్యములు , డొమినో పైజ్ రచించిన పెయింటింగ్ ఆధారంగా ఏర్పడినవే! కోర మీసాలు, రత్న ఖచితమైన తలపాగా, పాము కుబుసం వంటి చే నేత పంచె కట్టు, జుబ్బా , అలంకార శోభితుడైన ఆయన స్వరూపాన్ని ఆవిష్కరించడానికి మేకప్పు మెన్ (Makup men) పునాది రాయి ఈ పోర్చుగీసు వ్యక్తి బొమ్మ!(ఈ మధ్య శ్రీ కాళహస్తిలో జరిగిన ఘటనలో శ్రీ క్రిష్ణ దేవ రాయలు విగ్రహానికి ముప్పు వాటిల్లలేదనుట సాంత్వన కలిగించిన వార్త). 
          శ్రీ క్రిష్ణ దేవ రాయలు , డొమింగో పయస్    (Link for Information)

           రాయలు ఫొటో, photo  ( link)
&&&&&&&&&&&&&&

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...