26, డిసెంబర్ 2012, బుధవారం

నీర్ మహల్ వింతలు, విశేషము

మహారాజా బీర్ బిక్రం మాణిక్య బహదూర్  
"మాణిక్య్  వంశము" నకు చెందిన వాడు. 
ప్రపంచములోనే రెండవ పెద్ద వంశము 
"మాణిక్య వంశము" అవడము ఒక గొప్ప విశేషము.
1930 లో - రుద్ర సాగర్ అనే సరస్సులో “నీర్ మహల్” కట్టించాడు.
జల మధ్యాన కట్టుదిట్టముగా కట్టబడిన  భవనములు 
మన దేశములో "రెండు మాత్రమే" ఉన్నవి.
అవి రాజస్థాన్ లోని "జల మహల్ మొదటిది: 
త్రిపుర లోని “నీర్ మహల్” రెండవది.
***************;     
నీర్ = నీరు: ఈ మాట ద్రవిడ భాషకు చెందినది.             
కానీ ఉత్తర భారత దేశ రాష్ట్రమైన త్రిపుర లోని 
సరసు నడుమ ఉన్న భవంతికి “నీర్ మహల్” అనే పేరు – 
ద్రావిడ లింగ్విస్టిక్ ధ్వనిని కలిగి, హిస్టరీ పరముగా 
కొంత కుతూహలమును కలిగిస్తూన్నది.     స్సు ఉన్నది 
(చరిత్ర పరిశోధకులు పరిశీలంచ వలసిన  విశేషము ఇది! )

***************;  
1 వ ప్రపంచ యుద్ధం, 2 World War ల నడిమి కాలంలో 
ఈ బిల్దింగ్ ని కట్టారు.
త్రిపుర రాజు పూనుకున్న నిర్మాణము ఇది.

'మేలా ఘర్’ వద్ద ఉన్న ఈ జల హర్మ్యము "
అగర్తల" కు 55ఖం లో ఉంది.
మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్   
రుద్ర సాగర్ విస్తీర్ణము 5.35sq.km
పడవలను ఎక్కి ఇక్కడకు చేరగలరు. 
నీర్ మహల్ ఎండా కాలపు విడిది గా నిర్మాణము జరిగినది. 
హిందూ ముస్లిం వాస్తు మేళన సౌందర్యాల కలబోత ఇది. 
మాణిక్య రాజు అభిరుచికి పట్టిన నిలువెత్తు దర్పణము ఈ నీర్ మహల్. 
రాజస్థాన్ లోని "జల మహల్" తర్వాత ఇదే ఘన హర్మ్యము.

***************;   

24 గదుల్తో చూపరులను ఆకట్టుకునే అందచందాలు నీర్ మహల్ ది.
"బ్రిటీష్ కంపెనీ - " "మార్టిన్ బర్న్స్" (.Martin & Burn Co ) కి 
కన్స్ట్రక్షన్ బాధ్యతలను రాజు అప్పగించారు. 
మొత్తానికి అది పూర్తి కావడానికి 9 ఏళ్ళు పట్టినది.

***************;
;

;













 నీర్-మహల్  లో రెండు భాగాలు కలవు. 
"ఆండర్ మహల్" పశ్చిమ దిశా భాగము. 
ఇందులో రాజ వంశీకులు బస చేయడానికై కేటాయించారు. 
తూర్పు దిక్కున "బాహ్య రంగము" అనవచ్చును. 
 ఆరు బయట లలిత కళా ధామము ఈ విభాగము.
డాన్సులు, ఇతర కల్చరల్ యాక్టివిటీలు 
జరిగే "నర్తనశాల" ఇది. 
రాచవారు తమ టెన్షన్ లని కాస్సేపైనా మరిచిపోవడానికని - 
 ఏర్పాటు చేసుకునే వినోద కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూంటవి.
అందాలకు నెలవు, టూరిస్టులకు నేత్ర పర్వము 
ప్రకృతి ఒడిలోని ఈ "నీర్ మహల్"!


కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...