5, మే 2016, గురువారం

నీటివసతి, ప్రాచీనుల సేవ

శ్రీ సారంగపాణి కోవెల ఉన్న ఊరు "తిరుక్కుండతై".
ఈ కోవెల "కుంభకోణము" నకు ఒకటిన్నర మైలు దూరాన ఉన్నది. ;
శ్రీ మహా విష్ణుమూర్తి అనుగ్రహమును పొందిన
హేమఋషి ఆశ్రమము ఉన్నచోట
"మహా మాగ కొలం"  కొలను వెలసినది.
దానికి జంట కొలను "పొత్రమరై" (Potra marai kulam)
 "మహా మాగ కొలం", "పోత్రమరై కులం" అనే నీటి సరసులు ఉన్నవి.
ఈ సరోవర ద్వయానికి ఉద్భవ గాధ కలదు.

story ;-

ప్రళయవేళల బ్రహ్మదేవుని భుజాలపై ఉన్న బాధ్యత "సృష్టి పునర్ నిర్మాణము".
అందుకై సృష్టికర్త - అమృతము మొదలైన సామగ్రిని సేకరించాడు.
విరించి తన సేకరణలను ఒక కుండలో నింపాడు.
ఆ మట్టికుండను "మేరు పర్వత శిఖరము" (Mountain Meru) పైన
విరించి జాగ్రత్తగా అట్టిపెట్టాడు.
ప్రళయ కాలం వచ్చి, తెంపులేని వర్షాలతో అతలాకుతలం అవసాగింది.
బ్రహ్మ - అమూల్య వస్తు పూర్ణకుంభమును జాగ్రత్తగా రక్షించ పూనుకున్నాడు.
వరదభీభత్సాలనుండి కుంభపరిరక్షణ - 
తక్షణ కర్తవ్య దేవతలు కైలాసమునకు వెళ్ళారు.
దివ్యుల కోరికపై - భవుడు శరసంధానము చేసాడు.
నారి సారించి, అంబును విడిచాడు సాంబసదాశివుడు.
మహేశుడు విడిచిన బాణము కుండను తాకింది.
కుండ బ్రద్దలై  అందులోని సుధారసము అక్కడ రెండు భాగాలుగా పడినది.

ఆ ద్వి భాగాల పేర్లు  "మహా మాగ కొలం", "పోత్రమరై కులం" అనే రెండు కొలనులు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&,

శ్రీ సారంగపాణి ( ఆరావముదన్ ) కోవెల ఇక్కడ వెలిసినది.
 కుంభకోణమునకు 1 1/2 మైళ్ళు దూరములో
ఈ ";తిరు కుండతై Thirukkudanthai " ఉన్నది.
కుంభము భగ్నమైన చోటు –
కనుక “కుంభ కోణము”/ కుండతై (Kundatai) అనే పేరు వచ్చి,
నేడు పుణ్యతీర్ధముగా విలసిల్లుచున్నది)  

] మూలవరులు:- Thirukudanthai శ్రీ సారంగపాణి:
శ్రీ మహా విష్ణు ధనుస్సు పేరు "శార్ఙ్గము"
అందుచే ఈ స్వామి పేరు "సారంగపాణి".
ఈ స్వామి - ఆరా అముధన్, అభయాప్త మిరుతన్, ఉత్థాన శాయి
మున్నగు పేర్లతో కీర్తించబడుతున్నాడు.
హేమమహర్షికి  ప్రత్యక్షమైనది ఈ చోటులోనే! 
మూలవరులు ఉద్యోగశయన భంగిమలో ఉన్నారు,
అనగా అప్పుడే నిద్రనుండి మేల్కొన్న పొజిషన్ లో ఉన్నారు.
కోమలవల్లీ తాయారు ఈ కోవెలలో
మరొక దర్శన అభయ వరప్రదాయిని ఐ,
భక్తులను అనుగ్రహిస్తూన్నది.

&&&&&&&&&&&&&&&&&&&
నది 2 :-  

సురాధిపతి ఇంద్రుని వాహనము.
బర్మాలోని ఇరవదిడి నదికి - ఐరావతము- అనే నామము ఆధారము.
Ayeyarwaddy అని కూడా బర్మాలో (సంస్కృతము- పాలీ భాషా రూపము) పిలుస్తారు. 

] ఈ నదిలో మత్స్యజాతి ఇరవాడి డాల్ఫిన్ (Irrawaddy dolphin (Orcaella brevirostris)
విశాఖపట్టణము వద్ద బంగాళాఖాతంలో
1852 లో సర్ రిచర్డ్ ఓవెన్ కనుగొన్నారు;

విశాఖ వద్ద చూసిన Sir Richard Owen  1852 లో గ్రంధస్థం చేసి,
ప్రపంచ జంతు ప్రేమికులకు పరిచయం చేసాడు.
ఒరిస్సాలోని చిలక సరస్సు, కంబోడియా మున్నగు సీమలలో అగుపిస్తాయి.
సముద్ర, నదీ సంగమ జలములలో "డుగాంగ్", నక్షత్ర తాబేళ్ళు,
ఇంకా అసంఖ్యాక జలచర, పక్షులు ఉన్నవి. 

; నీటివసతి, ప్రాచీనుల సేవ [ akhilavanitha  ;-
;- =  Friday, March 8, 2013 ; బర్మాలో ఐరావది నది ] :- 
#neeTiwasati, praacheenula sEwa :- # 
;

1 కామెంట్‌:

vahini చెప్పారు...

చాలా బాగా వివరించారు. తెలియని విషయాలు తెలిపారు...ముందు ముందు కూడా దేవతలకు సంబంధిచిన విషయాలు ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...